బెట్టింగ్‌కు బానిసై రూ.15 కోట్ల అప్పులు చేసిన మిషన్‌ భగీరథ ఏఈ

-

సరదా కోసం మొదలు పెట్టిన బెట్టింగ్ ఇప్పుడు చాలా మంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తోంది. క్యాజువల్గా బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టి కాస్త డబ్బులు రాగానే పెద్ద మొత్తం నగదు పెడుతూ బెట్టింగ్కు అలవాటు పడుతున్నారు. చివరకు ఉన్నదంతా పోగొట్టుకుని ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువత నుంచి ముసలి వాళ్ల వరకు చాలా మంది బెట్టింగ్కు బానిసై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కొందరు బెట్టింగ్ పెట్టేందుకు డబ్బు కోసం అప్పులు చేస్తుంటే మరికొందరు నేరాలకు పాల్పడుతున్నారు.

తాజాగా రాష్ట్రానికి చెందిన మిషన్ భగీరథ ఏఈ ఆన్లైన్ గేమ్స్కు బానిసయ్యాడు. సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో బెట్టింగ్ కోసం డబ్బులు తీసుకొన్నాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలవడంతో వారు ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు. అయితే బాధితుల ఫిర్యాదుతో గతంలో కీసర పోలీస్ స్టేషన్లో ఏఈపై ఫిర్యాదు నమోదైంది. అతడిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన పోలీసులు తాజాగా అతడు దేశం దాటి పారిపోతుండగా దిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version