Hyderabad: బట్టతల రాకుండా జుట్టు పెరిగేందుకు నకీలి మందుల కలకలం

-

Hyderabad: బట్టతల రాకుండా జుట్టు పెరిగేందుకు నకీలి మందుల కలకలం రేపాయి. జుట్టు పెరిగేందుకు అవసరమైన మందులంటూ మెడికల్‌ మాఫియా ప్రచారం చేసింది. తక్కువ కాలంలో జుట్టు పెరుగుతుందని మోసాలు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రమాదకరమైన రసాయనాలతో క్రీములు తయారుచేసి విక్రయిస్తున్న ముఠా….బట్టతల రాకుండా జుట్టు పెరిగేందుకు మందులని ప్రచారం చేసినట్లు గుర్తించారు పోలీసులు.

Mixture of fake medicines to grow hair without baldness

ఈ తరుణంలోనే.. హైదరాబాద్ నగరంలో పలు మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ సోదాలు నిర్వహించింది. దీంతో పలు రకాల నకిలీ క్రీములను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన క్రీమ్ లు వాడడంతో ఉన్న జుట్టు ఊడిపోతుందని తెలిపింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో. తప్పుడు ప్రచారాలతో నకిలీ క్రీమ్లను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఐదుగురు సభ్యుల గల ముఠా అదుపులోకి తీసుకుంది డ్రగ్ కంట్రోల్ బ్యూరో. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news