మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపు ఎక్కువగా ఉంది : హరీష్ రావు

-

మూసీ మురికికి కారకులు కాంగ్రెస్, టీడీపీ నేతలే అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆంధ్ర బాబుల బ్యాగులు మోసి తెలంగాణ ఉద్యమ కారులమీద తుపాకీ పెట్టిండు రేవంత్. నీ సవాల్ కు నేను రేడి.. ఎక్కడ ఇండ్లు కూలగోడితే అక్కడ నుంచి చేద్దాం . రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ ది తిట్లు అయితే బిఆర్ఎస్ ది కిట్ల సర్కార్. మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపు ఎక్కువగా ఉంది. మాటలు కాదు.. ప్రజలకు చేతలు చూపించు.

రేవంత్ అందితే జుట్టు.. లేదంటే అబద్దాలు మాట్లాడుతుండు. సీఎం సోయితో మాట్లాడాలి. కానీ సీఎం కుర్చీకి విలువలేకుండా చేస్తుండు. రైతుల ధాన్యం ఎప్పుడూ కొంటారో చెప్పాలి. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు దాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు . కల్లాల వద్దకు సీఎం, మంత్రులు రావాలి.. రైతుల గోస తెలుస్తది. రైతులు రోడ్ల మీద.. మంత్రులు గాలిమోటార్లలో గాలిలో తిరుగుతూ విహార యాత్రలు చేస్తుండ్రు. రేవంత్ కు మహారాష్ట్ర కు డబ్బు మూటలు పంపేపనిలో ఉన్నారు. ఇక్కడ పత్తి రైతుకు మద్దతు ధర రావట్లే. BRS ప్రజల పక్షాన ఉంటది. ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన వంద సీట్లు గ్యారెంటీ అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version