రేవంత్ రెడ్డి జాగీర్ కాదు.. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అంటూ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి… ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు. శాంతి భద్రతల మీద ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నా ఇంటి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన అనుచరులు మీద చర్యలు తీసుకోలేదని… ఎమ్మెల్యేను హత్య చేసేందుకు పోలీసులు గుండాలను ఎస్కార్ట్ వాహనంలో తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటీ అని… ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాంధీపైన చర్యలు తీసుకోకపోవడం ఎంత వరకు సమంజసం అంటూ ఆగ్రహించారు. పోలీసు ఉన్నతాధికారులపైన చర్యలు తీసుకోలేదు… తనపై దాడికి గాంధీకి సహకరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.