అసెంబ్లీలో హరీష్ రావు రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తుల వలన మాలాంటి కొత్త సభ్యుల కు రాంగ్ ఫీడ్ పోతుంది అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. భూభారతి గొప్ప నిర్ణయం. భూభారతి గేమ్ చెంజర్ లాంటిది. ధరణి పోర్టల్ వలన ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు 20 లక్షల పట్టా భూములు ప్రొహిబిటెడ్ లిస్టులోకి పోయినవి. ధరణి వలన కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లాభం జరిగిందని mim అక్బరుద్దీన్ చెప్పారు.
బీఆర్ఎస్ కచరా పార్టీ అన్నడు అంటే వాళ్ళు అసెంబ్లీ లో వాళ్ళతీరు కనిపిస్తుంది. రైతులతో ఏడాది నుండి చర్చించి భూభారతి చట్టం బిల్లు అసెంబ్లీలో పెట్టాము. ధరణి ని రద్దు చేస్తే వాళ్ళ బాగోతం బయటపదుతుందని సభను అడ్డుకుంటున్నారు. భూభారతి ని తీసుకొస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ధరణి తో ఇబ్బందులు కడుతున్న రైతులకు ఇవ్వాళ విముక్తి కల్గింది అని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.