ప్రతీ రెండు నెలలకూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తాను : పవన్ కళ్యాణ్

-

పార్వతీపురం మన్యం.. మక్కువ మండలం బాగుజోలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేసారు. ఇందులో బాగుజోల-సిరివర గ్రామాల మధ్య 9 కి.మీ. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. గడచిన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. రూ. 500 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలస్ కట్టారు గాని, రూ. 9 కోట్లుతో ఈ రోడ్డు నిర్మించలేకపోయారు.

ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టి తెచ్చిన వేలాది కోట్ల రూపాయలు ఏం చేశారో తెలియదు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సుమారు 25 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదు. 2017 లో జనసేన పోరాట యాత్రలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనుల కష్టాలు చూశాను. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ తో కలిసి పనిచేస్తాను. పర్యాటక అభివృద్ధి చేసి, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రతీ రెండు నెలలకూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version