మంచు ఫ్యామిలీ వివాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

-

గత నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఫ్యామిలీ వివాదం తొలుత ప్రెస్ నోట్ లతో మొదలై.. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదులు, భౌతిక దాడులు, గన్ సరెండర్, ఆసుపత్రిలో చేరికతో పిక్స్ కి చేరింది. గత ఆదివారం మంచు మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ జరగగా.. ఆ తరువాత మనోజ్ గాయాలతో ఆసుపత్రిలో చేరారు.

అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మంచు మోహన్ బాబు కూడా రాచకొండ సిపికి లేక ద్వారా ఫిర్యాదు చేశారు. జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి గొడవ జరిగింది. మంచు మనోజ్ పై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. గేటుని బలవంతంగా తోసుకొంటూ ఇంట్లోకి వెళ్లిన మంచు మనోజ్ చిరిగిన చొక్కాతో బయటికి వచ్చాడు.

అదే సమయంలో మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంతో.. ఓ రిపోర్టర్ కి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు పై కూడా కేసు నమోదయింది. అయితే మంచు ఫ్యామిలీ వివాదంపై తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇంట్లో ఉండాల్సిన వ్యవహారాన్ని బయట పెట్టుకున్నారని, అందులోని నిజానిజాలను బయట పెట్టడానికి సిద్ధమైన జర్నలిస్టుపై దాడి చేయడం సరికాదని అన్నారు రాజా సింగ్. అందుకే మోహన్ బాబు బయటకు వచ్చి ఆ రిపోర్టర్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాయపడిన రిపోర్టర్ ను కలవాలని హితవు పలికారు రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version