ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ – మంత్రి పొన్నం

-

చిన్న చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టిజిఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 90 డిపోల్లో సుమారు 450 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు చిన్న తప్పులకే ఉద్యోగం కోల్పోయారని, వారి కుటుంబాల నేపథ్యాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి గెజిట్ విడుదల చేసింది. కానీ పలు సాంకేతిక కారణాలతో పాటు అదే సమయంలో సాధారణ ఎన్నికలు రావడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వివిధ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్రిసభ్య కమిటీకి చైర్మన్ గా లేబర్ ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్, సభ్యులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య వ్యవహరిస్తారని తెలిపారు. ఆర్టీసీలో విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో గతంలో నమోదైన సర్వీస్ రిమూవల్ కేసులను ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version