ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన పాత్ర ఎమ్మెల్యే సంజయ్ దే : భోగ శ్రావణి

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు అరెస్టయిన నలుగురు అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడంలేదు. ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్జీ ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ లొ ప్రధాన పాత్ర ఎమ్మెల్యే సంజయ్ దేనని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కమల నిలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారని శ్రావణి ఆరోపించారు.  ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పుకోవడానికి సంజయ్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడని పేర్కొన్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఎమ్మెల్యే సంజయ్ ని విచారించాలని.. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version