పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. సిరా గుర్తుపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం..!

-

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక జరిగిన 14 రోజులకే నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. అంటే మే 27న పట్టభద్రుల ఉప ఎన్నిక కి సంబంధించి ఉమ్మడి మూడు జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నిక జరుగనుంది.

మే 13న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న వారికి ఎడమ చేతి చూపుడు వేలుకు కొంత మందికి సిరా గుర్తు అలాగే ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు వేయాలని ఈసీ పోలింగ్ సిబ్బందికి సూచించింది. బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.  ఇక రేపు పోలింగ్ జరుగనుండటంతో శనివారం సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి ముగింపు పలికారు. ఈ ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. 4,63,839 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాఖేష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ మధ్యనే పోటీ నెలకొంది. ఎవ్వరూ సాధిస్తారో తెలియాలంటే మాత్రం జూన్ 05న నిర్వహించే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version