సాగు చేసే వారికే రైతుబంధు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

-

సాగు చేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం(రైతు బంధు పథకం కింద) అందిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించి డిసెంబరు చివరిలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనుందని వెల్లడించారు. ఆదివారం రోజున సారంగాపూర్‌ మండలంలోని రేచపల్లిలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ధరణిలో తప్పొప్పులను పరిశీలించి, కొంత మంది భూస్వాములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వందల ఎకరాలు సాగు భూములుగా చూపిస్తూ రైతు బంధు సాయం పొందుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అందుకే దీనిపై పునరాలోచించి సాగు చేసే భూములకు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున సాయం అందించేలా చూస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందని అయినప్పటికీ కేవలం ఆరు గ్యారంటీలే కాకుండా ప్రజా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపేదిలేదని ఇచ్చిన మాట తప్పకుండా తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version