పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అబద్ధాలాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతులకు సాయం చేసే విషయంలో ఓ ప్రధాని అవాస్తవాలు పలకడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
పార్లమెంటులో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘అదానీ’ అంశంపై జవాబు చెప్పలేదని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాతీయవాదం ముసుగులో ఆయన దాక్కుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
‘‘రైతులకు ప్రభుత్వం అందించే సాయంపై పార్లమెంటులోనే ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారు. 11కోట్ల మంది రైతులకు నగదు సాయం చేస్తున్నామన్నారు. కానీ, కేంద్రం 3.87 కోట్ల మంది రైతులకే సాయం అందిస్తోంది. ఏటా నగదు సాయం లబ్ధి పొందే రైతుల సంఖ్య తగ్గిస్తున్నారు’’ అని కవిత అన్నారు.