తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన 72 గంటల నిరాహార దీక్షలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ఆమె నిరాహార దీక్షకు చేపట్టారు. తాజాగా దీక్ష విరమింపజేశాం. అయితే కోర్టు తీర్పును గౌరవిస్తూ.. దీక్షను విరమింపజేస్తున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. సమయం ముగియడంతో దీక్ష స్థలి వద్ద నుంచి జాగృతి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు.
దీంతో ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు దీక్ష స్థలి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. అరగంటలో ధర్నా చౌక్ కాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. శాంతియుతంగా ధర్నా నిర్వహణకు సహకరించాలని పోలీసులకు కవిత రిక్వెస్ట్ చేశారు. ఇంకా 66 గంటల పాటు దీక్ష చేస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా కోర్టు తీర్పుతో కవిత దీక్షను విరమింపజేసినట్టు ప్రకటించారు. ఇంతటితో ఆగలేదని.. ఉద్యమం చేపడుతామని తెలిపారు.