ఉమెన్స్ డే రోజు ధర్నా చేసే దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ : ఎమ్మెల్సీ కవిత

-

వ్యక్తిగత కారణాలతో మరణించిన అమ్మాయిని కూడా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వాడుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. జీవో 3 వల్ల గురుకులాల్లో మహిళలకు 12 శాతం ఉద్యోగాలే వచ్చాయని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికే అన్ని చట్టాలు తెలుసన్నట్లు వ్యవహరిస్తారని విమర్శించారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, జీవో 3ను ఉపసంహరించుకొని వెంటనే హైకోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కవిత దీక్ష చేపట్టారు.

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేసే దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. 1996 లో పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళా రిజర్వేషన్లు తగ్గేలా ఉత్తర్వులు తీసుకొచ్చారు. అమలు చేస్తే ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ హైకోర్టు లో మెమో దాఖలు చేశారు. రేవంత్ ప్రభుత్వం హైకోర్టులో కేసు ఉపసంహరించుకొని ఆడబిడ్డలకు అన్యాయం చేశారు.” అని కవిత మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news