కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే కన్నీళ్లే మిగులుతాయి : కవిత

-

కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని తెలిపాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి కాంగ్రెస్ నేతలకు మనసు ఒప్పుకోలేదని మండిపడ్డారు. గతంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉండేదన్న కవిత.. ఇప్పుడు ఒక్క గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య లేదని వివరించారు. నిజామాబాద్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు.

“రెండు పర్యాయాల్లో ఎంతో అభివృద్ధి చేశాం, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం. రేషన్‌కార్డుల సమస్యను పరిష్కరించి అందరికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తాం. గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీ ప్రకటిస్తాం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఐదేళ్లలో కేవలం 21 ఉద్యోగాలు ఇచ్చాయి. తెలంగాణలో పదేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటికే 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్‌ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయి. ప్రైవేటులో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.” అని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news