సమాధానం చెప్పే ధైర్యం లేకే వ్యక్తిగత దూషణ.. ఎంపీ అర్వింద్​పై కవిత ఫైర్

-

రాష్ట్రంలో ఎన్నికల వేళ రాజకీయం వేడి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్షాలు, ఇతర పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోనూ ఎన్నికల వేడి వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈ జిల్లా నేతలైన ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవితల మధ్య తరచూ వర్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా అర్వింద్ మాటతీరుపై కవిత మండిపడ్డారు.

నిజామాబాద్​లో తాను ఓడిపోయిన తర్వాత.. గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను మౌనంగా ఉంటూ తన కార్యక్రమాలేవో తాను చేసుకుంటూ వెళ్లానని కవిత అన్నారు. కానీ ఎంపీగా గెలిచిన వ్యక్తి తన బాధ్యతను.. స్థాయిని విస్మరించి ఇష్టం వచ్చినట్లు తనపై అనేక సార్లు వ్యక్తిగత దూషణ చేశారని తెలిపారు. రాజకీయపరంగా ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ.. ఇలా తనను అరవింద్ వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలే చెప్పాలని పేర్కొన్నారు. దేని గురించైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఎంపీ అరవింద్​కు లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రా పాలకులపై ఇలాంటి అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయలేదని.. అప్పుడు కూడా అంశాల వారిగానే వారిని హుందాగా ప్రశ్నించామని కవిత అన్నారు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడు కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news