రాహుల్‌గాంధీ నిజామాబాద్​కు వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు: ఎమ్మెల్సీ కవిత

-

ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి తెలంగాణ గుర్తుకు వస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.  65 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ  చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలపై హస్తం పార్టీకి పట్టింపే.. లేదని  వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలపై కేంద్రాన్ని ఎప్పుడైనా  రాహుల్‌ గాంధీ నిలదీశారా అని ప్రశ్నించారు.

“నిజామాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి మాకు ఏమీ చెప్పనక్కరలేదు. బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాహుల్‌ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు. వేలమంది బీసీ యువకులు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించాం. రైతుబంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. రైతులపై రాజకీయం చేయడం కాంగ్రెస్‌ నేతల నైజం. ఇక్కడ అన్ని వర్గాలు కలిసి శాంతి, సామరస్యంతో జీవిస్తున్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్‌కు వందల కంపెనీలు వచ్చాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతలా అభివృద్ధి జరిగిందా?” అని కవిత ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version