అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత

-

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించింది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో మూడోసారి విజయం సాధించడానికి ఇదే కీలకం కానుంది. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్‌ అగ్రగామిగా నిలిపారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్ఫూర్తినిచ్చారు. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ‘అభివృద్ధిలో ఆదర్శంగా తెలంగాణ’ అనే అంశంపై ఆమె మంగళవారం రోజున ప్రసంగించారు.

తెలంగాణ శాంతి,  సామరస్యాలకు ప్రతీక అని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మత కల్లోలం కూడా జరగలేదని కవిత తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతౌల్యం పాటిస్తూ.. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తోందని పునరుద్ఘాటించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. వేర్వేరు రంగాల్లో 22.36 లక్షల ఉద్యోగాలను సృష్టించామని చెప్పుకొచ్చారు. ఇక ధరణి పోర్టల్‌ ద్వారా భూ రికార్డుల కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కవిత వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news