ఓ వ్యక్తి మరణానికి కారణమైన తీన్మార్ మల్లన్న కారు ఫోటోలు వైరల్ !

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదంలో చిక్కుకున్నారు. తీన్మార్ మల్లన్న కారు కారణంగా ఓ వ్యక్తి మరణించారు. తీన్మార్ మల్లన్న కారు ‘TS 30 J 7200’ మహీంద్రా తార్ నిన్న సాయంత్రం ఓ వలస కార్మికుడి ప్రాణాలు తీసింది. ఈ కారు తీన్మార్ మల్లన్న ప్రధాన ఆనుచరుడు అయిన కాసుల అంజేయులు గౌడ్ కుటుంబ సభ్యులైన కాసుల తులసి పేరుతో ఉంది.

ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన వెళ్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశ్ (32) అనే వ్యక్తిని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో గాయాలు అయిన ఉదేశ్ ను మొదట సమీపంలోని నీలిమా ఆస్పత్రికి తరలించారు.అక్కడి నుండి గాంధీ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఉదేశ్ మృతి చెందారు. ఆ కారులో తీన్మార్ మల్లన్న మరియు అతని అనుచరులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ తాజాగా ఓ వ్యక్తి మరణానికి కారణమైన తీన్మార్ మల్లన్న కారు ఫోటోలు వైరల్ గా మారాయి. తీన్మార్ మల్లన్న థార్‌ కారు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version