తెలంగాణ రైతులకు శుభవార్త..ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే డబ్బులు జమ

-

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్‌ రావు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే డబ్బులు జమ చేస్తామని రైతులకు భరోసా కల్పించారు హరీష్‌ రావు. సిద్దిపేట అర్బన్ (మం) వెల్కటూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలోనే మొదటి సారిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించుకున్నామని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనమని చెప్పినా.. సీఎం కేసీఆర్ కొంటామని చెప్పారన్నారు. కొనుగోలు పూర్తయిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version