Anasuya : 15 ఏళ్ల క్రితం నాటి ఎంగేజ్మెంట్ చీరలో అనసూయ సోకుల సోయగం

-

అనసూయ భరద్వాజ్ ట్రెడిషనల్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. 15 ఏళ్ల క్రితం నాటి తన ఎంగేజ్మెంట్ చీరలో ఈ భామ ఫొటోషూట్ చేసింది. పట్టుచీరలో కుందనపు బొమ్మలా అలరించింది. ఈ ఫొటోలు చూసి రంగమ్మత్తను ఇంత అందంగా ఎప్పుడు చూడలేదంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ యాంకర్ గా వెలిగిన అనసూయ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది. క్షణం, రంగస్థలం, పుష్ప ఇలా వరుస హిట్లతో దూసుకెళ్తోంది. మరోవైపు బుల్లితెరపైనా అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆ ఫొటోలను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. నెగిటివ్ కామెంట్లకు కూడా ఈ బ్యూటీ రియాక్టయి ఎడామడా తిట్టేస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకా ట్రోల్ అవుతూ ఉంటుంది. కానీ అనసూయ తాజా ఫొటోలు ట్రోలర్స్ నోరు మూయించాయని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version