బీఆర్ఎస్ కి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రశ్న..!

-

బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడంతో పాటు పార్టీని కాపాడుకోవడం.. లిక్కర్ కేసులో జైలులో ఉన్న కవితను బయటికి తీసుకురావడం వంటి వాటికి అదే పరిష్కారం అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నారా..? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా
సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ను ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు గులాబీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటుంది. ఈ క్రమంలోనే బీజేపీ విలీనంపై ఆన్సర్ చెప్పాలని నేరుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడంతో.. కారు, కైట్ పార్టీలకు మధ్య ఫ్రెండ్ షిప్ బ్రేక్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ ప్రచారం జరుగుతోంది. విలీనం వార్తలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్న గులాబీ లీడర్స్ ఓవైసీ వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version