సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్..!

-

సీఎం రేవంత్ రెడ్డి పై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఎంపీ రఘునందన్ రావు పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి పక్క పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం పై ఉన్న శ్రద్ధ. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్న, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాల పెంపు కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటంపై, రైతుబంధు, రైతు భరోసా రాలేడీని రైతులు పడుతున్న బాధలపై సీఎం దృష్టి సారిస్తే బాగుండేది అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ టు గా చెప్పుకునే మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ టు గా చెప్పుకునే మంత్రి. బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చమని చెప్పే వరకు వలసలు కొనసాగుతాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి ప్రకటనలు ఇస్తున్న మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కోరుకున్న మాదిరి రాజ్యాంగం పరిరవిలాలని బిజెపి నాయకులు కోరుతుంటే.. భారత రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలవని కొంతమంది పెద్ద మనుషులు. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పక్క పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం హోదాలో కండువాలు కప్పడం దురదృష్టకరమన్నారు. పక్క పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశం రాజ్యాంగంలో ఏ పేజీలో ఉందో తనకు తెలియదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news