నటుడు కమల్ హాసన్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్..!

-

జమ్మూకశ్మీర్ లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై తెలంగాణ బీజేపీ  కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు  మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయకులపై జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల చర్య దుర్మార్గమని అన్నారు. దేశం ఉలిక్కిపడే ఘటన జరిగితే సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్  ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పైగా ఘటనపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం సమయంలో జరిగిన
ఈ ఉగ్రదాడిలో పదుల సంఖ్యలో అమాయకులు బలయ్యారు. తుపాకులతో వందల రౌండ్లు కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా  దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి  నేపథ్యంలో అక్కడి వ్యాపారులు గొప్ప మనసు చాటుకుంటున్నారు. భయంతో వణికిపోతున్న పర్యాటకులకు సాయం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news