సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ నిర్ణయాలపై పాక్ ప్రతికార చర్యలు తీసుకుంది. సైన్యానికి సెలవురు రద్దు చేసింది. ఒకవేళ భారత్ దాడి చేస్తే.. తిప్పి కొట్టాలని సైనికులను ఆదేశించింది.అట్టారీ-వాఘా బార్డర్ మూసివేసింది. భారతీయులకు సార్క్ వీసాలను రద్దు చేసింది. భారత్ లో అన్ని వ్యాపార సంబంధాలకు తెగదెంపులు చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు వెనక్కి వెల్లిపోవాలని ఆదేశించింది.
పహల్గామ్ దాడిపై భారతావని కంటతడి ఆగక ముందే పాకిస్తాన్ తన బుద్దిని మరోసారి చూపించింది. భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాన్ ను పాక్ సైన్యం బందించింది. సైనికుడు తమ భూభాగం లోకి ప్రవేశించడంతోనే అరెస్ట్ చేశామని చెబుతోంది. ఈ ఆరోపణలను బీఎస్ఎఫ్ ఖండించింది. పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలతో జవాన్ ను అదుపులోకి తీసుకుందని మండిపడింది.