మునుగోడు ఉపఎన్నికలో 92% పోలింగ్

-

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ సమయానికి బారులు తీరిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు. రాత్రి 10.30 గంటల వరకు ఓటు వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 92 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 6న నల్గొండలో జరగనున్న ఓట్ల లెక్కింపులో వారి భవితవ్యం తేలనుంది.

ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. పరస్పరం ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో పోలింగ్‌ ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని బూత్‌ల్లో పోలింగ్‌ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.

మధ్యాహ్నం 1 గంట ముగిసేసరికి 41.30 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఆ తర్వాత ఓటర్లు వరుస కట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దాదాపు 36 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. వృద్ధులు, వికలాంగులకు సరిపడా వీల్‌చైర్లు లేకపోవడంతో ఓటేయడానికి వారు ఇబ్బంది పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version