చిన్న పిల్లలు చేసే పనులు ఒక్కోసారి సరదాగా, అందరికీ నవ్వులు పూయించేలా ఉంటాయి. వారి ఫిర్యాదులు కూడా గమ్మత్తుగా ఉంటాయి.తాజాగా ఓ బాలుడు తన హెలికాప్టర్ ఎగరడం లేదని.. అది అమ్మిన ఓనర్ మీద చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కంగ్టిలో జాతరకు వెళ్లిన వినయ్ రెడ్డి (10) రూ.300కు కొన్న బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యజమాని మోసం చేశాడని, బొమ్మ తీసుకోకుండా కోప్పడ్డాడని ఆరోపించాడు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్‌ను పంపగా, అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయినట్లు సమాచారం.దీంతో బాలుడి తాతను పిలిచి, బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
నా హెలికాప్టర్ ఎగరడం లేదు
సంగారెడ్డి జిల్లా కంగ్టిలో జాతరకు వెళ్లిన వినయ్ రెడ్డి (10) రూ.300కు కొన్న బొమ్మ హెలికాప్టర్ ఎగరకపోవడంతో షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యజమాని మోసం చేశాడని, బొమ్మ తీసుకోకుండా కోప్పడ్డాడని ఆరోపించాడు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్… pic.twitter.com/0xnMFdcZ6y
— ChotaNews App (@ChotaNewsApp) April 22, 2025