Medak: బీజేపీ నాయకులను పరామర్శించిన మైనంపల్లి కుటుంబం !

-

మెదక్ పట్టణంలో గాయపడ్డ బీజేవైఎం నాయకులను పరామర్శించారు మైనంపల్లి రోహిత్. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకుడి ఆరోగ్యం గురించి పూర్తి బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మైనంపల్లి రోహిత్.

Mynampally family visited BJP leaders

శనివారం రాత్రి మెదక్ పట్టణంలో కొందరు అల్లరి మూకలు సృష్టించిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం నాయకులు అరుణ్ ను కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హైద్రాబాద్ లోని మియాపూర్ పద్మావతి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. అరుణ్ రాజ్ ఆరోగ్యపరంగా పూర్తి బాధ్యతలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దీంతో బీజేపీ నేతలను కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించడం ఏంటో అంటూ జనాలు భిత్తరపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news