పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్‌ గుప్తాను అప్పగించిన చెక్‌ రిపబ్లిక్‌

-

ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టై చెక్‌ రిపబ్లిక్‌ జైలులో మగ్గుతున్న భారతీయుడు నిఖిల్‌ గుప్తాను ఆ దేశ అధికారులు అమెరికాకు అప్పగించారు. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోమవారం రోజున నిఖిల్ ను న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తమ గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్‌ సుపారీ ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో అమెరికా సూచనల మేరకే తాము గుప్తాను అరెస్టు చేసినట్లు చెక్‌ అధికారులు తెలిపారు. వ్యాపార, విహార యాత్ర కోసం చెక్‌ రిపబ్లిక్‌ వెళ్లిన తనను గతేడాది జూన్‌ 30వ తేదీన విమానాశ్రయంలో అరెస్టు చేశారని గుప్తా ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news