ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకే నాగరాజు హత్య… సెక్యులర్లు ఎందుకు స్పందించడం లేదు: బండి సంజయ్

-

ముస్లిం యువతని పెళ్లి చేసుకున్న దళిత యువకుడు నాగరాజును హత్య చేయడాన్ని పూర్తిగా మతపరమైన హత్యగానే పరిగణించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ హత్య చేసిన వ్యక్తుల ను వెంటనే గుర్తించాలి; వారి వెనుక ఉన్న శక్తులను, సంస్థలను బయట పెట్టాలని బిజేపి డిమాండ్ చేశారు. ఇంత కిరాతకమైన సంఘటన పట్ల సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లవ్ జిహాద్ పేరుతో మతోన్మాద సంస్థలు ప్రేమ పేరుతో మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని బిజేపి విమర్శిస్తే… ఈ సెక్యులర్ వాదులు బిజేపి ని మత ఉన్మాదులు అంటున్నారు. మరి ఈ సంఘటన ఏ కోవకు చెందినదో కుహనా మేధావులు ప్రజాలకు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఏ ముస్లీం యువతి కూడా హిందూ యువకుడిని పెళ్లి చేసుకోకుండా భయ బ్రాంతులకు గురి చేసేందుకే ఇంత కిరతకమైన హత్యకు పాల్పడ్డారన్నారు. గతంలో మిర్యాలగూడ లాంటి సంఘటనలు జరుగితే గొంతెత్తి అరిచిన అభ్యుదయ వాదులు, అభ్యుదయ మీడియా ఎందుకు ఈరోజు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.హిందూ యువతి, ముస్లీం యువకుడిని పెళ్లి చేసుకుంటే, మతం మార్చుకుంటూ హిందూ కుటుంబాలను వెక్కిరిస్తుంటే, ఆ అవమానం భరించలేక హిందూ కుటుంబాలు ఆత్మ హత్యలకు పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆటువంటి సంఘటనలపట్ల కుహనా మేధావులు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకోవాలి. ఇటువంటి కిరతకమైన సంఘటనలను ఖండించాలి, నిరసన వ్యక్తం చేయాలి. ఇటువంటి సంఘటనలను ప్రోత్సాహిస్తున్న మతోన్మాద శక్తులను, వాళ్ళకు మద్దతు ఇస్తున్న సంస్థలను, వాటికి సహకరిస్తున్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version