నాగార్జునసాగర్‌ డ్యామ్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల

-

నాగార్జునసాగర్ డ్యామ్‌కు మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మూసివేసిన డ్యామ్ గేట్లను తాజాగా నీటిపారుదల శాఖ అధికారులు తెరిచారు. తాజాగా డ్యామ్ ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6 క్రస్టు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీరు వదులుతున్నారు. పూర్తిస్థాయి మట్టానికి నీరు చేరడంతో మళ్లీ నాగార్జునసాగర్ గేట్లను తెరిచారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుతం అదే మేర నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలోనే గేట్లు తెరిచారు.

ఇక సాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా ఉంది. సాగర్‌కు 95,469 క్యూసెక్కుల వరద వస్తుండగా 6 గేట్లు తెరిచి అంత వరదనూ బయటకు పంపుతున్నారు. ఇక సాగర్ గేట్లు తెరవడంతో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. అయితే ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం.. మూడ్రోజులు సెలవులు రావడంతో గేట్లు ఇలాగే తెరిచి ఉంటే సందర్శకులు తాకిడి మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news