సీఎం రేవంత్ పై నళిని వివాదాస్పద పోస్ట్…వాడుకొని వదిలేశారు..?

-

నన్ను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారు.. అంటూ సీఎం రేవంత్ పై మాజీ పోలీస్ అధికారిణి నళిని ఆవేదన వ్యక్తం చేశారు. అడుక్కునే వారికి ఇచ్చిన విలువ కూడా నాకు రేవంత్ సర్కారులో ఇవ్వట్లేదు… సిఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద మీద యాది చేసిండు .ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు అంటూ ఆగ్రహించారు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి. ఆశ్చర్యంగా నా వూసే ఎత్తలేదని ఫైర్ అయ్యారు. ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తుందన్నారు.

Nalini’s controversial post on CM Revanth

మా చిన్నప్పుడు ఆడుక్కొనేటోడు ఇంటి ముందుకు వస్తె,ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి ఎల్లవయ్య అని మెల్లగా చెప్పేటోల్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి.అందుకే నేను ఇన్నేళ్ళు ఎవ్వరినీ కలవాలే. ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయినవి అంటూ చురకలు అంటించారు. ఒక నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తిచేస్తారు అనుకున్న.7 నెలలు కావస్తోంది.అందుకే రిమైండర్ లెటర్,పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చూట్టూ తిరిగేంత సమయం మరియు ఓపిక నా వద్ద లేవు అని నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పినట్లు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version