బైక్ పై స్టంట్స్ తో రీల్స్ చేస్తూ.. ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి మృతి

-

నేటి యువత సరదా కోసం రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ కోసం డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఆ క్రమంలో ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ఇప్పటికే ఇలా మరణించిన వారెందరో ఉన్నారు. ఇటీవలే జలపాతం వద్ద రీల్స్ చేస్తూ ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మరణించిన విషయం తెలిసిందే. ఆ వార్త మరవకముందే తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో బైక్పై స్టంట్లు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రోజు సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సమీపంలో జాతీయ రహదారిపై వర్షంలో కేటిఎమ్ బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో కింద పడి శివ అనే యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలవ్వగా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version