కొండా సురేఖపై కేటీఆర్ వేసిన క్రిమినల్ డిఫర్మేషన్ పై నేడు విచారణ..!

-

మంత్రి కొండా సురేఖ పై కేటీఆర్ వేసిన క్రిమినల్ డిఫర్మేషన్ పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో నేడు విచారణ జరగనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్ లను రికార్డ్ చేయనుంది కోర్టు. నిరాధారమైన కొండా సురేఖ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అంటున్నాడు.

అయితే గత విచారణలో కొండాసురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలను కోర్టుకు చదివి వినిపించాడు కేటీఆర్. 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించాడు కేటీఆర్. ఇక హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది కోర్టు. అయితే ఆ సమన్లుకు ఈ రోజు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది కొండా సురేఖ. ఈ కేసులో ఇప్పటికే నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేసింది న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news