హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు

-

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు దక్కింది. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది.

National Award for Hyderabad Cyber ​​Crime Police
National Award for Hyderabad Cyber ​​Crime Police

ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు. టెక్నాలజీ ద్వారా ఛేదించిన సైబర్ క్రైమ్ కేసుల పై ప్రెజంటేషన్ ఇచ్చారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ తరుణంలోనే… మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌కు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. కాగా.. నిన్న హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు గుట్టు రట్టు చేశారు పోలీసులు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ దొరికిపోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. అతనితో పాటు మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news