త్వరలో పరిగిలోని నేవీ ప్రాజెక్టు పనులు ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి

-

పరిగి నియోజకవర్గం దామగుండం దేవాలయం ప్రాంతంలో దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


నేవి కమండర్ శ్రీ కార్తిక్ శంకర్ బృందం, పరిగి ఎమ్మెల్యే శ్రీ రాంమోహన్ రెడ్డి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసారు. నేవి కమండర్ కార్తిక్ శంకర్ ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

నావికాదళానికి చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నేవి కమాండర్ ముఖ్యమంత్రికి వివరించారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నేవి అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news