ఏపీలోని ట్రిపుల్ ఐటీ, ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ఠ్. ఆర్జీయూకేటీ పరిధిలో ట్రిపుల్ ఐటీలు, ఇంటర్ కాలేజీలకు నేటి నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 18న కాలేజీలు పునః ప్రారంభం అవుతాయి.

ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలన్నీ తప్పకుండా హాలిడేస్ ఇవ్వాలని, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా స్కూళ్లకు ఈనెల తొమ్మిది నుంచే సెలవులు ప్రారంభమైన విషయం తెలిసిందే. 18వ తేదీ వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి.
అటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 6,795 స్పెషల్ బస్సులను సిద్ధం చేయగా…. వాటిలో హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసమే 1,600 బస్సులను కేటాయించింది. తాజాగా హైదరాబాద్ నుంచి అదనంగా మరో 1,000 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.