ఏపీ పేదలకు గుడ్ న్యూస్‌..పెన్షన్ల పంపిణీ గడువు పెంపు !

-

ఏపీ పేదలకు గుడ్ న్యూస్‌..పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ కూడా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచడంతో పాటు కొత్తగా 1.17 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

దీంతో జనవరి 1 నుంచి 8 వరకు వాలంటీర్లు పంపిణీ చేశారు. తర్వాత మరో రెండు రోజులు పొడిగించగా, ఇవాళ కూడా పంపిణీకి ప్రభుత్వం అనుమతించింది. 66.34 లక్షల మందికి గాను నిన్నటి వరకు 65.44 లక్షల మందికి పంపిణీ జరిగింది.

కాగా, చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ. 417 కోట్ల వడ్డీ లేని రుణాలు జమ చేయనున్నారు. ఇందులో కొత్త లబ్ధిదారులకు రూ. 10,000, పాతవారికి రూ. 11,000, రూ. 12,000, రూ. 13 వేల చొప్పున అందిస్తారు. అలాగే 5.81 లక్షల మందికి రూ. 13.64 కోట్ల వడ్డీ రీయంబర్స్మెంట్ ను జమచేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news