మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు?.. రాష్ట్ర నీటిపారుదలను ప్రశ్నించిన ఎన్‌డీఎస్‌ఏ

-

మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతులు, పరీక్షలకు సంబంధించి మరో నిపుణుల కమిటీని వేసి గ్రౌటింగ్‌ చేయడమేంటని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం. తమ సిఫార్సుల ప్రకారం కాకుండా.. తాము సూచించని ప్లింత్‌ శ్లాబ్‌ గ్రౌటింగ్‌ను ఎలా చేస్తారని నిలదీసినట్లు తెలిసింది. దీనివల్ల జియో టెక్నికల్, జియో ఫిజికల్‌ పరీక్షల ఫలితాలు సరిగా వచ్చే అవకాశం లేదని .. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా ఉందని నిపుణుల కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో తాము చేసిన సూచనల మేరకు ఇప్పటివరకు జరిగిన పనులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ… శనివారం తెలంగాణ నీటిపారుదల శాఖ బృందంతో దిల్లీలో సమావేశమైంది. ఇప్పటివరకు చేసిన పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రజంటేషన్‌ ఇచ్చి.. ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన పనుల్లో పూర్తయిన, ఇంకా చేయాల్సిన వాటిని వివరించారు. అయితే తమ కమిటీకి సమాంతరంగా మరో కమిటీ వేసి, తాము సిఫార్సు చేయని పనులను చేయడమేంటని నిపుణుల కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version