కరోనా కాలంలో భారత్‌లో 11.9 లక్షల అధిక మరణాలు

-

కరోనా మహమ్మారి భారత్‌తోపాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి సోకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత్‌లో దాదాపు 5లక్షల మందికిపైగా మృతి చెందారు. అయితే, కొవిడ్‌ సమయంలో భారత్‌లో రిపోర్ట్‌ చేసిన సంఖ్య కంటే ఎక్కువ మరణాలు సంభవించినట్లు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌ ఓ అధ్యయనం ప్రచురించింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో 2020లో కొవిడ్‌తో 11.9 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. భారత్‌ అధికారికంగా ప్రకటించిన మరణాలసంఖ్య కంటే 8 రెట్లు ఎక్కువని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ-లెక్కల కంటే 1.5 రెట్లు అధికమని నివేదించింది.

 

2020లో కొవిడ్‌ సమయంలో మరణాలపై సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేదని, తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కొన్ని మీడియాల్లో ఈ అధ్యయనం ప్రచురితం కావటంతో …ఈ మేరకు స్పందించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-NHFS-5ని ప్రామాణిక పద్ధతిలో విశ్లేషించినట్లు అధ్యయనకర్తలు పేర్కొన్నప్పటికీ…అందులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version