Nehru Zoo Park Ticket Prices: నెహ్రూ జూపార్కు వెళ్లే వారికి బిగ్ షాక్ తగిలింది. నెహ్రూ జూపార్కులో ఎంట్రీ టికెట్ల ధరలను పెంచింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. మహశివ రాత్రి రోజున నెహ్రూ జూపార్కులో ఎంట్రీ టికెట్ల ధరలను పెంచింది ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటన చేసిన టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలుగా పెరిగాయి.

అటు నెహ్రూ జూపార్కులో కెమెరా, పార్కింగ్ టికెట్ ధరలు పెంచారు. గతంలో పెద్దలకు 70 రూ, పిల్లలకు 45 రూ టిక్కెట్ ఉండేంది. ఇప్పుడు డబులు చేశారు. ఇక నెహ్రూ జూపార్కులో పెంచిన ధరలు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కాబట్టి అందరూ సహకరించాలని కోరారు నెహ్రూ జూపార్కు అధికారులు.
- నెహ్రూ జూపార్కులో ఎంట్రీ టికెట్ల ధరలు
