రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ శనివారం సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు అంజనీ కుమార్. ఈ సందర్భంగా అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అంజనీ కుమార్ రాష్ట్ర ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిజిపి మహేందర్ రెడ్డి, సిపిలు సివి ఆనంద్, మహేష్ భగవత్ తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహేందర్ రెడ్డి కి వీడ్కోలు పలికారు ఉన్నతాధికారులు. కొత్త డీజీపీగా అంజనీ కుమార్కు స్వాగతం పలికారు. బీహార్ రాజధాని పాట్నాలో 1966 జనవరి 28న జన్మించిన అంజనీ కుమార్ పాట్నాతో పాటు ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇక అంజని కుమార్ 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.