తెలంగాణలో 2024-25 సీజన్‌లో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం… టెండర్లు, రవాణా, పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు అడుగడుగునా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. చేప పిల్లల పంపిణీలో అవకతవకలపై ఆది నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న నిబంధనలను సమీక్షించి మత్స్యశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
చేపల పంపిణీకి నూతన మార్గదర్శకాలు ఇవే..
- ఇప్పటివరకు టెండర్‌దారులు పాలిథిన్ సంచిలో చేపపిల్లలను చూపించేవారు.. ఇకపై బుట్టలో చూపించాలి.
- పెద్ద సైజువి సేకరించేందుకు ఒక్కో కిలోలో 250 నుంచి 300 వరకు ఉండాలి.
- చేపల రవాణా వివరాలు టీమత్య్స మొబైల్‌యాప్‌లో నమోదు చేస్తారు.
- చెరువుల్లో వేసిన 12, 24 గంటలకు ఒకసారి చొప్పున స్థానిక సొసైటీ ప్రతినిధులు తనిఖీ చేస్తారు.
- గతంలో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పొడవు గల లక్ష పిల్లల ధర రూ.53,600 నుంచి రూ.61,930కి పెంచింది.
- 80 నుంచి 100 మిల్లీమీటర్ల పొడవు గల లక్ష పిల్లల ధర రూ.1,50,600 నుంచి రూ.1,61,640కి పెంచింది.