తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 14వ తేదీన కొత్త రేషన్ కార్డుల జారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. అక్కడి నుంచి కార్యక్రమం మొదలవుతుంది.

నియోజకవర్గాలలో మంత్రులు అలాగే ఎమ్మెల్యేల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. ప్రస్తుతానికైతే కాగితం రూపంలోనే కార్డులు అందిస్తారని తెలుస్తోంది. ఇక రేషన్ కార్డు లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా రూపొందించారు. దీనికోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారిక సైట్ ఓపెన్ చేయాలి. అందులో చూపించినట్లు.. మనం ముందుకు వెళ్తే రేషన్ కార్డు లిస్టులో మన పేరు చెక్ చేసుకోవచ్చు.
రేషన్ కార్డు కోసం ఇలా చెక్ చేసుకోండి
https://epds.telangana.gov.in/FoodSecurityAct/