జూన్ 2న కొత్త తెలంగాణ చిహ్నం విడుదల !

-

జూన్ 2న కొత్త తెలంగాణ చిహ్నం విడుదల కానుందట. జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు సిద్ధమవుతోందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్ వరంగల్ కాకతీయ తోరణం తొలగించింది రేవంత్‌ సర్కార్‌. ఇక ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నం తయారు చేస్తోంది రేవంత్‌ సర్కార్.

New Telangana emblem released on June 2

అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేయనుందట. జూన్ 2 నాటికి పూర్తిస్థాయిగా పలుమార్పులు చేర్పులు చేసి విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి..మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version