తెలంగాణలో కొత్తగా “U” టాక్సులు… 950కోట్ల స్కామ్…మంత్రిపై సంచలన ఆరోపణలు..!

-

తెలంగాణలో 950 కోట్ల స్కామ్ జరిగిందని…మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

maheshwar reddy comments in chit chat

మొన్న రూ.500 కోట్లు చేతులు మారాయని, అందులో రూ.100 కోట్లను ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి పంపారని చెప్పారు. సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఆయన డబ్బులు తరలించారన్నారు. యూ టాక్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్లు కేసి వేణుగోపాల్ కు ఇచ్చారని….ఇది వాస్తవం కాదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు తనకన్నా ముందుకు వెళ్తున్నారని, తను వెనుకబడి పోతున్నానని భయంతోనే ఉత్తమ్ ఇలా చేశారని విమర్శించారు. రైస్ మిల్లర్లతో ఉత్తమ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని, 450 కోట్లు ఆయనకు చెల్లించారన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ స్కామ్ 950 కోట్లు అని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు ఎవరికి వారుగా టోల్ గేట్లను ఏర్పాటు చేశారని, త్వరలోనే మిగతా శాఖల బండారం కూడా బయట పెడతానని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news