Telangana : ప్రజాపాలన కోసం తెచ్చిన వెబ్ సైట్ ఇదే

-

గత నెల 28 తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ https://prajapalana.telangana.gov.in/ ను ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ ప్రారంభిస్తారు.

Six Guarantee Promise

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version