తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఏ

-

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో దాదాపు 62 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో సోదాలకు సంబంధించిన వివరాలతో ఎన్‌ఐఏ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ముచింగిపట్టు మావోయిస్టు కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నర్సింహులును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు… కడపలో రూ.13 లక్షల నగదు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

“ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించాం. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, ఏలూరు, విశాఖ, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌లో సోదాలు జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హనుమకొండ, ఆదిలాబాద్‌లో జిల్లాల్లో సోదాలు చేశాం. సీఎల్‌సీ, ఏబీఎంసీ, సీఎంఎస్, కేఎన్‌పీఎస్, పీడీఎం, పీకేఎస్, పీకేఎం, ఆర్‌డబ్ల్యూఏ, హెచ్‌ఆర్‌ఎఫ్, సీఆర్‌పీపీ, ఐఏపీఎల్ నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిపాం. మావోయిస్టు అనుబంధ సంఘాల నాయకులు మవోయిస్టులకు సహకరిస్తున్నట్లు ఆధారాలున్నాయి’’ అని ఎన్‌ఐఏ ప్రకటనలో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version