వరల్డ్ రికార్డ్ సృష్టించిన వెస్ట్ ఇండీస్ మహిళా క్రికెటర్ !

-

ఈ రోజు ఆస్ట్రేలియా మరియు వెస్ట్ ఇండీస్ మహిళల మధ్యన జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో హీలీ మ్యాథ్యూస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం ఆస్ట్రేలియా మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి వెస్ట్ ఇండీస్ ముందు కష్టసాధ్యం అయిన లక్ష్యాన్ని 213 ఉంచింది. కానీ వెస్ట్ ఇండీస్ మహిళలు చాలా పోరాటం చేసి మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇక ఈ విజయంలో కెప్టెన్ మ్యాథ్యూస్ కీలక ఇన్నింగ్స్ ను ఆడి భారీ సెంచరీ (132) చేసింది. ఈమె ఇన్నింగ్స్ లో ఏకంగా 20 ఫోర్లు మరియు 5 సిక్సులు ఉన్నాయి. ఈ విజయంతో వెస్ట్ ఇండీస్ నమ్మకం మరింతగా పెరిగింది. కాగా ఈ మ్యాచ్ ను గెలిపించినందుకు గాను మ్యాథ్యూస్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయింది.

దీనితో అంతర్జాతీయ టీ 20 లలో వరుసగా ఏడు మ్యాచ్ లలోనూ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ లను అందుకున్న మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా వరుసగా ఇన్ని సార్లు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version