కాంగ్రెస్‌ ఎంత చెప్పినా.. అవి మోదీ బియ్యమే: బండి సంజయ్‌

-

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత చెప్పినా.. అవి మోదీ బియ్యమే అని అన్నారు. ప్రధాని మోదీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటలో బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ పెడితే పోలీసులతో చింపేయిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటో పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని.. కానీ ప్రధాని మోదీ ఫొటో మాత్రం తప్పకుండా పెట్టమని విజ్ఞప్తి చేశారు. బియ్యానికి డబ్బులిచ్చేది కేంద్రమే కాబట్టి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కాస్త విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. బియ్యం విషయంలో రాష్ట్రం వాటా ఏమైనా ఉంటే చెప్పండని.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news